"నీలోని విశ్వాసమే,నీ ఆత్మీయ ఎదుగుదలను నిర్ణయిస్తుంది"
ఒక మనిషి పెద్దవాడా,చిన్నవాడా అంటే అతని వయసును బట్టి చెప్పవచ్చు.అతని మనసు వయస్సు కూడా అంతే అనలేము ఎందుకంటే కొంతమంది ఎంత వయస్సు వచ్చినా చిన్నపిల్లలా ప్రవర్తిస్తారు.చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ లాగా ప్రవర్తిస్తారు.శరీరము ఎదగవచ్చు కానీ మనసు కూడా వారి వయసుకు తగ్గట్టు ఎదుగుతుందని చెప్పలేము.
కానీ ఇక్కడ ఒక మనిషి,క్రైస్తవుడు అని చెప్పడానికి,అతను ఆత్మీయంగా ఎదిగాడని చెప్పడానికి అతనిలోని విశ్వాసమే తోడ్పడుతుంది.ఈ కాలంలో యేసయ్య ఉన్నాడని చెప్పడానికి,యేసయ్య మరణాన్ని జయించి లేచాడని చెప్పడానికి,అద్భుతాలు చేయును అని చెప్పడానికి మనలోని విశ్వాసపు మాటల,మనలోని విశ్వాసపు ప్రవర్తనే తోడ్పడ్తాయి.అప్పుడు ఆటోమాటిక్ గా అన్యులలో కూడా విశ్వాసము బలపడ్తుంది.యేసయ్య నామంలో సాతాను క్రియలు కూడా అణచివేయగలము.ఇదే ఆత్మీయ ఎదుగుదల.
విశ్వాసము లేని క్రియలు నిర్జీవమైనవి.అవి సాతాను క్రియలు.దేవుని అద్భుత శక్తి అనుభవించి కూడా విశ్వాసంలో నిలకడగా లేకుంటే అతను దేవునికి దూరంగా ఉన్నాడని,ఆత్మీయంగా ఎదుగుదల లేదని,సులువుగా సాతాను వలలో పడగలడని చెప్పవచ్చును.
యేసయ్యకే మహిమ కలుగును గాక.ఆమేన్
0 Comments