నీ పాపం నిన్ను పట్టిస్తుంది, జాగ్రత్త!
ఒకరోజు ఓ దొంగ మందిరంలోని కానుకుల పెట్టెను దొంగతనం చేసి పారిపోతుండగా జాన్ అనే ఒక వ్యక్తి ఆ దొంగను చూసి మందిర ఆవరణంలో పట్టుకొన్నాడు.
ఈ దొంగ జాన్ తో “చూడు మిత్రమా దయచేసి నా జోలికి రాకు, నేను పెద్ద దొంగను, ఈ దొంగతనాలు నాకు వెన్నతో పెట్టిన విద్య, మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను వెళ్తాను” అని అన్నాడు.
అందుకు జాన్ నువ్వు ఎంత పెద్ద దొంగవి అయినా దొరికే రోజు ఒకటి వస్తుంది.
అందుకే ఈరోజు నువ్వు నాకు చిక్కావు అంటూ అటుగా వెళ్తున్న పోలీసులను చూసి దొంగ దొంగ అని అరుస్తూ పోలీసులను పిలిచాడు. పోలీసులు మందిర ఆవరణంలోకి వస్తుండగా ఆ దొంగ తెలివిగా కానుకుల పెట్టెను జాన్ చేతిలో పెట్టి దొంగ దొంగ అని అరవడం మొదలు పెట్టాడు. దొంగని పట్టుకున్న జాన్ ఆశ్చర్యపోయాడు.
పోలీసులు దగ్గరకు రాగానే ఆ దొంగ అమాయకంగా పోలీసులను నమ్మిస్తూ వీడే ఆ కానుకుల పెట్టెను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను సార్, వీడిని అరెస్ట్ చెయ్యండి, ఇలాంటి దొంగలను వదిలేస్తే దేశం నాశనం అయిపోతుంది సార్ అని అసలైన దొంగ మంచివాడిలా నటిస్తున్నాడు.

అది చూసి జాన్ ఆశ్చర్యపోయి, ఇదంతా అబద్దం సార్, వీడే అసలు దొంగ అంటూ పోలీసులకు తన వాదన వినిపించాడు జాన్. చివరికి పోలీసులు ఎవరు దొంగ, ఎవరు మంచివాడు అర్థం కాక ఇద్దరినీ పోలీసు స్టేషనుకు తీసుకెళ్ళి ఒకే గదిలో బందించారు.
ఇప్పుడు అసలైన దొంగ జాన్ తో, నేను నీకు ముందే చెప్పానుగా నా జోలికి రాకు, నాకు ఇలాంటివి మామూలే, నాకు దొంగతనాలు వెన్నతో పెట్టిన విద్య, నన్ను వదిలి నీ దారిన నువ్వు వెళ్ళు అంటే విన్నావా? అనవసరంగా ఇరుక్కున్నావు. నిన్ను “ఆ దేవుడు కూడా విడిపించలేడు” అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే, జాన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.

ఈలోగా పోలీసులు ఇద్దరినీ బయటకు పిలిచి ఇన్స్పెక్టర్ గారి ముందు నిలబెట్టారు. ఇన్స్పెక్టర్ వారిని చూసి గర్జిస్తూ నిజం చెప్పండిరా, ఎవరు దొంగతనం చేసింది అని అడిగాడు. అసలు దొంగ నాకేమి తెలియదని అద్బుతంగా నటించాడు.
అప్పుడు ఇన్స్పెక్టర్ “టేప్ రికార్డర్” ఆన్ చేసాడు...
నేను నీకు ముందే చెప్పానుగా నా జోలికి రాకు, నాకు ఇలాంటివి మామూలే, నాకు దొంగతనాలు వెన్నతో పెట్టిన విద్య, నన్ను వదిలి నీ దారిన నువ్వు వెళ్ళు అంటే విన్నావా? అనవసరంగా ఇరుక్కున్నావు అని దొంగ జాన్ తో పలికిన మాటలను ఆ ఇన్స్పెక్టర్ వినిపించాడు. అప్పుడు అసలు దొంగ ఏడవటం మొదలు పెట్టాడు.

ఆ పొలిసు ఆఫీసర్ వారిద్దరిని సెల్ లోకి త్రోసి వారు ఏమి మాట్లాడుతున్నారో రహస్యంగా వారి మాటలు రికార్డు చేసాడు.
అసలు దొంగ బయట పడ్డాడు, జాన్ విడిపించబడ్డాడు.
అసలు దొంగ బయట పడ్డాడు, జాన్ విడిపించబడ్డాడు.
గమనించాలి, తప్పుడు పనులు చేసేవారు, అక్రమముగా సంపాదించే వారు, స్నేహం పేరుతో, ప్రేమ పేరుతో ఇతరులను మోసం చేసే వారు, వ్యభిచారం చేసే వారు, అక్రమ సంభందాలు గలవారు, నేను ఎవరికీ దొరకను. నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకోవచ్చు. కాని పాపానికి ఒక గుణం వుంది, అది పాపం చేసేవాడిని పట్టిస్తుంది.
దేవుని వాక్యం
సెలవిస్తుంది “నీ పాపం నిన్ను పట్టుకోనును” (సంఖ్యాకాండము 32:23)
సెలవిస్తుంది “నీ పాపం నిన్ను పట్టుకోనును” (సంఖ్యాకాండము 32:23)
ఆ దొంగ కూడా దొరకను అనుకొన్నాడు కాని దొరికిపోయాడు.
దావీదు ఉరియాను చంపించాడు, తన మోసం ఎవరికీ తెలియదులే అనుకొన్నాడు, కాని చివరకు దొరికిపోయాడు (2 సమూయేలు 11-12 అధ్యాయాలు)
గేహజీ తన తప్పుడు పని ఎవరు చూడట్లేదులే అనుకోన్నాడు, కాని చివరకు దొరికిపోయాడు (2 రాజులు 5:20-27)

అననియా, సప్పిరా కూడా ఎవరికీ దొరకములే అనుకొన్నారు, కాని చిరవకు దొరికిపోయారు (అపోస్తలు కార్యములు 5 అధ్యాయం)
ఈ సందేశం చదువుతున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా ఈరోజు నీవు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నవేమో పరీక్షిచుకో? దొరకనులే అనుకుంటున్నావా?ఎదో ఒక రోజు తప్పక దొరికిపోతావు. ఆ రోజు రాకముందే దయచేసి ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు, ఆ పాపం విధించే శిక్ష నుండి తప్పించుకో. లేకపోతే చివరకు ఆ పాపమే నిన్ను పట్టుకొని నీ జీవితాన్ని బంధకాలలో పడేస్తుంది జాగ్రత్త!
దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టునువాడు తన పాప పాశముల వలన బంధింపబడును. (సామెతలు 5:22) "యేసయ్యా..నీలోనే నా సంతోషం"
నాన్నా...యేసయ్యా...సంతోషం కోసం ఎన్నో దార్లు నడుస్తున్నాము.
నిజమైన సంతోషంను వేటిలోను కనుగొనలేకపోయాను.
ఎవరిలోనూ కనుగొనలేకపోయాను.
ఎవరిలోనూ కనుగొనలేకపోయాను.
చివరికి నేను కష్టపడిన దాంట్లో కూడా క్షణకాల సంతోషమే.
నేను ప్రేమించినవారిలో,నిజసంతోషం కోసం వెదకి వేసారిపోయాను.
నన్ను ప్రేమించిన వారిలో కూడా సంతోషంను వెదికాను.కానీ దొరకలేదు.అది కూడా క్షణభంగురమే.
బహు జ్ఞానము సంపాదించినను అది కూడా సంతోషమియ్యలేకపోయింది.
ప్రభువా,నా దేవా,యేసయ్యా...సాత్వికమైన నీ ప్రేమలోనే,అద్వితీయమైన నీ ప్రేమలోనే,అవధులు లేని నీ ప్రేమలోనే,వెలకట్టలేని నీ ప్రేమలోనే నిజసంతోషం కనుగొన్నానయ్యా!
అది చిరకాలమైనదని,సమాధానము కలుగజేసి నెమ్మదితో నా జీవితమంతయు నన్ను నడిపించుచున్నదని తెల్సికొనియున్నాను.
నీకే ఘనతా ప్రభావములు కలుగును గాక.ఆమేన్.
అది చిరకాలమైనదని,సమాధానము కలుగజేసి నెమ్మదితో నా జీవితమంతయు నన్ను నడిపించుచున్నదని తెల్సికొనియున్నాను.
నీకే ఘనతా ప్రభావములు కలుగును గాక.ఆమేన్.
క్రైస్తవులుగా మనకు ఉండవల్సిన అలవాటు ఏమంటే ఎవర్నీ కూడా బ్రతిమిలాడకూడదు.మనకు ఏమైనా కావాలన్నా,ఏదైనా జరిగించాలన్నా,ఎవర్నీ కూడా బ్రతిమిలాడకుండగ,యేసయ్య నామమున తండ్రికి మొరపెట్టుము.అప్పుడు అవి దొరుకును.
మనమెవరినైనా బ్రతిమిలాడితే మనల్ని అవతలి వారు చులకనగా చూస్తారు.అసలు పట్టించుకోరు.అదే యేసయ్యను బ్రతిమిలాడితే,మన కోసము ప్రాణము పెట్టాడు కనుక మనకు బ్రతిమిలాడేంత పరిస్థితి రాకముందే మనకు కావాల్సినవి సమకూర్చుతాడు.మనము అలా బ్రతిమిలాడితే చూడలేక యేసయ్య వెంటనే మనల్ని హత్తుకుంటాడు.అది ఆయన ప్రేమ గొప్పతనము.
అలాగే మనము ఏదైనా తప్పు చేసి ఎవరినైనా బాధపెట్టియుంటే వారిని బ్రతిమాలుకొనుచూ క్షమాపణ చెప్పనవసరము లేదు.దేవుని యందు భయంతో,వినయంతో ఒకసారి నిజాయితీగా క్షమాపణ చెప్పండి.వారు క్షమించడము,క్షమించకపోవడము అది వారి ఇష్టము.మన వల్ల ఇతరులు బాధ పడినపుడు,క్షమాపణ చెప్పడం మన బాధ్యత.ఆ క్షమాపణ చెప్పడమే కాదు దాని వలన మనలో మార్పు రావాలి.ఇతరులకు కూడా తను మళ్ళీ ఈ తప్పు చేయదు అనేలా వారిలో నమ్మకం కలిగించేలా దేవుని వలె నిజాయితీగా ఫలించి జీవించాలి.అంతేకానీ ఆ తప్పు మరల మరల చేసి ఇతరులను బాధపెట్టడము అంటే దేవునిని ఆయాసపర్చడము అవుతుంది.
అలాగే మనము ఏదైనా తప్పు చేసి ఎవరినైనా బాధపెట్టియుంటే వారిని బ్రతిమాలుకొనుచూ క్షమాపణ చెప్పనవసరము లేదు.ఇలా ఎందుకు చెప్పడము జరిగిందంటే..
ఉదా:తన కుమారుడు తప్పు చేశాడని తండ్రికి తెలిసినపుడు,అలా చేయకూడదు నాన్నా.వెళ్ళి క్షమాపణ చెప్పిరమ్మంటాడు.ఆ పిల్లవాడు,వాళ్ళ నాన్న చెప్పాడు అని,తన తప్పు సరిదిద్దుకునేలా అవతలి వ్యక్తికి ఒకసారి క్షమాపణ చెప్పింటాడు.ఆ వ్యక్తి క్షమిస్తే పర్వాలేదు.కానీ ఆ పిల్లవాడు అలాగే క్షమాపణ చెప్తూ బ్రతిమాలుతున్నాడు.అవతలి వ్యక్తిలో ఎలాంటి చలనము లేదు.ఇలా చేస్తుంటే చివరికి తన కొడుకు మీదనే తనకు జాలి కలిగి,అవతలి వాడి మీద కోపం కలుగుతాది అతనికి.సరే నీ బాధ్యతగా క్షమాపణ చెప్పావు చాలు రారా!నువ్వు అలా బ్రతిమాలుతుంటే నేను చూడలేకపోయాను అంటాడు గ్యారంటీగా.(ఆ కుమారుడు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే మాత్రము ఆ తండ్రే మార్పు వచ్చేలా శిక్షిస్తాడు)ఇహలోకపు తండ్రే ఇంత ప్రేమగా ఉంటే,పరలోకపు తండ్రి మన కోసము ఎంతగానో ప్రేమించి యేసయ్యను బలిగా అర్పించాడు.అనగా మనము అనగా దేవుని చిత్తానుసారంగా నడిచే పిల్లలమైన మనకు దేవుని దృష్టిలో ఎంతో విలువ ఉంది.ఆ విలువ పోగొట్టుకోకుండగ,మన ఎప్పటి తప్పులు అప్పుడు,అవతలి వారి దగ్గర క్షమాపణ కోరి,మారుమనస్సు పొందేలా ప్రవర్తించడము క్రైస్తవులుగా మన బాధ్యత.అప్పుడు ఎవరి దగ్గర బ్రతిమిలాడే పరిస్థితి రాదు.

యేసయ్యకు మహిమ కలుగును గాక.ఆమేన్.
0 Comments