Recents in Beach

యోబు చేసిన విజ్ఞాపనా ప్రార్ధన

*యోబు చేసిన విజ్ఞాపనా ప్రార్ధన*
*యోబు*:
• ఊజు దేశపు ధనవంతుడు.
• యథార్థవర్తనుడు
• న్యాయవంతుడు
• దేవునియందు భయభక్తులు కలిగిన వాడు.
• చెడుతనము విసర్జించిన వాడు.
• *పది మంది పిల్లలతో సహా, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితులలో కూడా దేవుని స్తుతించ గలిగినవాడు.*
1. *ఆదర్శవంతమైన తండ్రి:*
ఆయన పిల్లలు తప్పుచేసారని కాదు. ఒకవేళ చేసి యుండవచ్చేమోనని నిత్యమూ ఉదయముననే లేచి, దహన బలులు అర్పించేవాడు.
యోబు 1:5
2. *ఆదర్శవంతమైన భర్త:*
అతని భార్య దేవుని దూషించి చచ్చిపో అంటూ, అతనితో మాట్లాడుతున్న సందర్భంలో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు అని అన్నాడుగాని, మూర్ఖురాలా అని కూడా సంభోధించినవాడు కాదు. అట్లా నోటి మాట చేతనైనా పాపం చేసినవాడు కాదు.
యోబు 2:9,10
3. *ఆదర్శవంతమైన స్నేహితుడు:*
సాతాను దేవునితో వాదం పెట్టుకున్నాడు. నీవు యోబుకు అన్నీ అనుగ్రహించావు కాబట్టి, నిన్ను సేవిస్తున్నాడు. అవి తీసివేస్తే? నీ జోలికిరాడు అని. ఆ సందర్భంలో దేవుడు యోబు ప్రాణమును తప్ప, తనకు కలిగినదంతయూ, సాతాను చేతికి అప్పగించాడు. సాతాను అనేక విధాలుగా యోబును బాధించాడు. 10 మంది పిల్లలు చనిపోయారు, భార్య సహితం అతని మీద తిరగబడింది. ఆరోగ్యం క్షీణించిపోయింది.
అట్లాంటి పరిస్థితులలో యోబు యొక్క ముగ్గురు స్నేహితులు తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును ఆదరించడానికి వచ్చి, వారి మాటలతో యోబును మరింత వేధించారు. దేవుని సన్నిధిలో అతనిని దోషిగా నిలువబెట్టారు. అయితే, దేవుడు వారినే దోషులుగా నిర్ధారించి, మీ దోష నివారణ జరగాలంటే? నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్ధించాలని, అట్లా చేస్తే, మీరు శిక్ష నుండి తప్పించబడతారని దేవుడు సెలవియ్యగా, తన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్ధించి, వారిని శిక్ష నుండి తప్పిస్తాడు.
నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను......
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను
యోబు 42:8-10
*మన కష్ట సమయాల్లో, మన ప్రాణ స్నేహితులే మన మీద తిరగబడి, మనలను అవమానపరచిన సందర్భాలెన్నో? అయినా, వారి రక్షణ, క్షేమం గురించి విజ్ఞాపన చెయ్యాల్సిన భారం, భాద్యత మన మీదుంది.*
~ఆ భారం నీకుందా?
నీ భాద్యత గుర్తుందా? అయితే,
విజ్ఞాపన చేద్దాం! ఒక్కరినైనా ఆయన వైపుకు త్రిప్పుదాం! నిత్య మరణం నుండి తప్పిద్దాం!~
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Post a Comment

0 Comments