Recents in Beach

"యేసయ్య నాకోసం తలుపు తీసియున్నాడు. మూసివేయగల వాడెవడు?"

"యేసయ్య నాకోసం తలుపు తీసియున్నాడు. మూసివేయగల వాడెవడు?"

ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు?
అనగా ఆయన మాట లేనిదే ఎవరూ ఏమి చేయలేరు.ఎక్కడా ఏమి కూడా జరుగదు.
ప్రతి దానికి సమయము ఉంది.ఆయన మాట ఇచ్చి నెరవేర్చే కాలము వచ్చినపుడు దానిని ఆపగలవాడెవడునూ లేడు.ఆ సమయము వచ్చినపుడు దేవుని చిత్తమే జరిగి తీరుతుందని.
ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము ఉంది.అనగా ఏ కార్యాలైనా జరగాలంటే దేవాదిదేవుడు ప్రతి దానికి సమయము పెట్టియున్నాడు.ఆ సమయము వచ్చినపుడు ఆకార్యాలు జరిగి తీరుతాయి.
అనగా దేవుడు కొంతకాలం మన జీవితాల్లో కొన్ని కార్యాలు(పెళ్ళి,ఉద్యోగం,సంతానం, ఆరోగ్యం,)నెరవేరడానికి కాలము ఇంకా రాలేదని మన యెదుట తలుపు మూసి ఉంచి యుంటాడు.అది ఇప్పుడే జరగాలని,ఇప్పుడే కావాలని ఎంత ఆరాటపడి తలుపు తీయాలని చూసినా,తలుపు వెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తలుపు తెరువబడదు.కానీ అదే దేవుని సమయము వస్తే మాత్రం,మనము వద్దన్నా,ఎవరు వద్దన్నా కూడా తలుపు తీస్తాడు.అప్పుడు ఆ తలుపు మూయుటకు ఏ నరుని శక్తి చాలదు.కారణము అది సర్వశక్తిగల దేవుడు తలపెట్టిన కార్యము.
కనుక దేవుని కొరకు నిరీక్షించుడి.ఆయన ఏ కార్యము చేసినా దానిని తిరిగి మార్చగలవాడెవడునూ లేడు.అంత బలవంతమైన దేవుని కార్యము మన జీవితంలో జరగనియ్యుడి.ఆయనకు తరతరములకు,యుగయుగములకు మహిమ కలుగును గాక.ఆమేన్.

Post a Comment

0 Comments