"యేసయ్యకే నా వందనములు"
మామూలుగా ప్రతి ఒక్కరూ ఏ మంచి జరిగినా,ఎవరైనా మంచి చేసినా వెంటనే వారికి కృతజ్ఞతలు తెల్పుతాము కానీ దానికి కారణము యేసయ్య అని ఎవరూ ఆలోచించరు.
మనకు మంచి జరుగుతుంది.మనకు మేలు జరిగింది.మనకు విజయము లభించింది అంటే దానికి కారణము దేవుని కృప.సమస్తము సమకూడి జరిగించుచున్న దేవుని ప్రణాళిక.దేవుని మహిమకర కార్యము.ఆయన కృప వలనే మనమింకా తుడిచిపెట్టుకుపోలేదు.నిత్యజీవానికి వారసులుగా మార్చాడు.కనుక
క్రైస్తవులమైన మనము గుర్తించవల్సినది,చేయవల్సినది ఏమంటే దేవుడు ఏ కార్యము మన పక్షమున సఫలము చేసినా మొదట మనము యేసయ్యకే వందనములు చెల్లించవల్సినది అని.
క్రైస్తవులమైన మనము గుర్తించవల్సినది,చేయవల్సినది ఏమంటే దేవుడు ఏ కార్యము మన పక్షమున సఫలము చేసినా మొదట మనము యేసయ్యకే వందనములు చెల్లించవల్సినది అని.
ఏ మనిషికైనా కృతజ్ఞతలు తెల్పునపుడు కంటే ముందుగా యేసయ్యకి కృతజ్ఞతగా ఆయన పాదాలకు వందనములు తెలియజేయుము.అప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటాము.అలాగే మన రెండు చేతులు ఎత్తి ఎప్పటికీ అశాశ్వతమైన మనుష్యులకు కానీ,
పలకని మాట్లాడని విగ్రహాలకు వందనములు పెట్టకూడదని దేవుని ఆత్మ గద్దిస్తూ చెప్తున్న మాటలివి.
పలకని మాట్లాడని విగ్రహాలకు వందనములు పెట్టకూడదని దేవుని ఆత్మ గద్దిస్తూ చెప్తున్న మాటలివి.
యేసయ్యకు మహిమ కలుగును గాక.ఆమేన్.
0 Comments