Recents in Beach

"స్వార్థపూరిత ఈ లోకంలో,నాకు నీ నిస్వార్థ ప్రేమ కావాలి నాన్నా"

             "స్వార్థపూరిత ఈ లోకంలో,నాకు నీ నిస్వార్థ ప్రేమ కావాలి నాన్నా"

లోకము స్వార్థ పూరితమైనది.తమ అవసరాల కోసము మరొకరి దగ్గర నటించగలదు.అవసరము వరకే మాట్లాడగలదు.అవసరము వరకే మనకు తోడుగా ఉంటారు.అవసరము వరకే నేనున్నానంటూ మరింత దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు.ప్రాణాలు కూడా తీస్తారు.ఎవరేమై పోతే నాకేంటి అనుకుంటారు.
అవసరానికి వాడుకునేంత భయంకరమైన ఈ లోకంలో,శాశ్వతంగా నన్ను ప్రేమించేవారు దొరుకుతారని ప్రతి దశలో ఓడిపోయాను కానీ నాన్నా...యేసయ్యా...ఓడిపోయి కూలిపోయిన నా జీవితాన్ని నిస్వార్థమైన నీ ప్రేమతో లేవనెత్తి జీవము పోశావు కదా యేసయ్యా!
నీ వలె లోకాన్ని జయించు బిడ్డగా,నీ వలె నిస్వార్థమైన ప్రేమను పంచేలా ఫలింపజేయుము నాన్నా!ఇప్పటికి,ఎప్పటికీ నీ ప్రేమను నాలో ఫలింపజేయుమయ్యా!
నీ నిస్వార్థ ప్రేమలో సంతోషము,సమాధానము కలదు.ఆమేన్.

Post a Comment

0 Comments