Recents in Beach

అన్యుల వలె క్రైస్తవులు మూఢనమ్మకాలు నమ్మకూడదు

         "అన్యుల వలె క్రైస్తవులు మూఢనమ్మకాలు నమ్మకూడదు"

అన్యులు అనగా క్రీస్తు పేరు మాత్రము ఎరిగి,ఆయన గూర్చి ఎరుగని వారు.ఆయన నామములో రక్షణ పొందని వారు.ఆయన మహిమ ఎరుగని వారు.
క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన వారంతా క్రైస్తవులు కాదు కానీ క్రీస్తును పోలినడుచుకొను వారందరు క్రైస్తవులు.
చాలామంది అన్యులకు ఉండే మూఢనమ్మకాలు:
*ఉదయం నిద్ర లేవగానే ఒక మంచి వ్యక్తి ముఖము చూస్తే,ఆ రోజంతా మంచి జరుగుతుంది అనుకోవడం.
* వెళ్ళే ముందు పిల్లి ఎదురొస్తే,విధవరాలు ఎదురొస్తే కీడు జరుగుతాది అనుకోవడం.
*ఆడపిల్లలకు కుడి కన్ను అదిరితే చెడు జరుగుతాది అని,మగపిల్లలకు ఎడమ కన్ను అదిరితే చెడు జరుగుతాది అని.
*వేళ్ళే ముందు ఎక్కడికి అని అడిగితే పని జరగదని.
*బల్లి శరీరం మీద పడితే చెడు అని.
*గ్రహణాలకు భయపడడము.
ఇలా ఎన్నో విచిత్రమైన మూఢనమ్మకాలు.
సమస్తము జరిగించువాడను నేనే అని సజీవుడైన దేవుడు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోండి.మన దైనందిక జీవితంలో ఏ రోజు మేలు జరగాలన్నా అది దేవుని చిత్తము.అంతే కానీ ఎవరి ముఖమో ఉదయాన్నే చూడడం వలన కాదు.
అలాగే మన జీవితంలో శ్రమల ద్వారా,సమస్యల ద్వారా,లోపము ద్వారా దేవుడు మనకు దగ్గరవ్వాలని,ఆ శ్రమలను సహించినవాడు వాటి వెనుక దాగి ఉన్న మేలును పొందుకుంటాడని దేవుని ఉద్దేశం అంతే కానీ పిల్లి ఎదురొస్తే చెడు జరిగిందని కాదు.పిల్లి అలా వెళ్ళడం అనేది దేవుని చిత్తమే కానీ దాని గూర్చి బైబిల్ లో ఎక్కడా చెడుగా చెప్పబడలేదు.విధవరాలు ఎదురు రావడము చెడు అని కూడా ఎక్కడా లేదు బైబిల్ లో.వారిని బాధపెట్టకూడదని మాత్రమే బైబిల్ చెప్తుంది అంతేకానీ ఆమె భర్త చనిపోవడము దేవుని చిత్తమే కానీ అది ఆమెకు శాపంగా భావించకూడదు.
సర్వసృష్టి దేవుని చేతి కార్యములు.ఆకాశము ఆయన సింహాసనము.భూమి ఆయన పాదపీఠము.ఆయనకు తెలియకుండగ ఏదియు జరగదు.ఆయన వలననే సమస్తము జరుగుచున్నది.భూమి మీద ఎన్నో కార్యాలు జరిగిస్తున్న దేవుడు,ఆయన ఆకాశంలో జరిగించు గ్రహణాల వలన తనను నమ్ముకున్నవారికి హాని కలుగజేయునా!వాటికి భయపడకూడదు.అవిమన దేవుని కార్యములు.
మన అంతరంద్రియములు పరిశీలించు దేవుడు,మన శరీరంలో కుడి కన్ను అదరడం వల్ల మన జీవితంలో కీడు జరుగుతుందని ఎక్కడా బైబిల్ లో చెప్పలేదు.అసలు కుడి కన్నుకి జీవితానికి ఏమిటి సంబంధము? ఆలోచించండి.మనము చేసే పాపము వలనమన జీవితంలో కీడు జరుగును గానీ మరే శరీరభాగాలు అదరడం వలన కాదు.
అలాగే యేసయ్య ప్రకటించిన క్రొత్త నింబంధనయే ప్రేమ నిబంధన.ఆయన ప్రేమించమని చెప్పాడే కానీ ఏ జీవిని అంటరానిదానిగా చూడమని చెప్పలేదు.బల్లి మన మీద పడినా లేదా తాకినా వెంటనే స్నానము చేయడము లేదా కీడుగా భావించడము అంటరానితనము కాదా?ఆలోచించుము.
మన దేవుడు లేదా సజీవుడైన యేసు ప్రభువుల వారు మూఢనమ్మకాలను తిప్పికొట్టేలా కార్యాలు చేయగలడు కానీ ఏ శరీర భాగాలు,ఏ జీవులు మన జీవితాన్ని నిర్దేశించవు అని గమనిద్దాము.
యేసయ్యకు మహిమ కలుగును గాక.ఆమేన్.

Post a Comment

0 Comments