Recents in Beach

ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ-4

ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ-4

పాదరక్షలు విడుచుట
మనం భారత్ దేశంలో నివశిస్తున్నాం. మన దేశంలో ఏ మతస్తులైన దైవ మందిరానికి వెళ్ళినప్పుడు తమ పాదరక్షలు తీసివేసి వెళ్తారు. 
మన క్రైస్తవులు కూడా చాలావరకు పల్లెటూర్లలో అది ఏ సంఘమైనా సరే చెప్పులు తీసి మందిరం లోనికి వెళ్తారు ఆరాధనకి. పట్టణాలలో కూడా చాలా సంఘాల వారు పాదరక్షలు బయట విడచి ఆరాధనకు వెళ్తారు, మిగిలిన వాళ్ళు పాదరక్షలతోనే గుడిలోకి వెళ్తారు. అన్ని మతాలవారు చెప్పులు తీసి వెళ్తారు కాని దేవాది దేవుణ్ణి ఆరాదిస్తున్నాం అని చెప్పుకొనే మనం దౌర్భాగ్యం ఏమిటంటే పాదరక్షలతోనే గుడిలోకి పోతాం. ఇదేనా దేవునికిచ్చే గౌరవం?

ముఖ్య విషయం ఏమిటంటే అన్ని సంఘాల్లోను ఆదివారం నాడు వాక్యం చెప్పినప్పుడు సంఘకాపరి చెప్పులు విడచి వాక్యం చెబుతారు. మంచిది. మరి సభలలోను, మిగిలిన ఆరాధనల్లోను ఎందుకు చెప్పులు వేసుకొని వాక్యం చెబుతున్నారు? ఇది వాక్యనుసారమా? వాక్యానికి వ్యతిరేఖమా? చూద్దామ్

మొదటగా దైవ గ్రంధంలో మొదటసారిగా నిర్గమ ఖండంలో మోషే గారికి దేవుడు చెబుతున్నారు నిర్ఘమ 3:5 లో, అందుకాయన
దగ్గరకు రావద్దు. నీ పాదములనుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలచియున్నస్థలము పరిశుద్ధ ప్రదేశము. చూశారా? అది ఒక పర్వతము మాత్రమే దాని పేరు హోరేబు పర్వతము.అది దేవుని మందిరం కాదు గాని దాని మీద దేవుని ప్రత్యక్ష్యత కలిగింది మోషె గారికి మొట్టమొదటగా. ఎక్కడైతే దేవుడుంటారో అదే పరిశుద్ద ప్రదేశం అందుకే నీ పాదములనుండి నీ చెప్పులు విడువుము అని దేవాది దేవుడే తన నోటితో చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? ఒక సామాన్యునితో కాదు ఒక గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఒక ప్రవక్తతో.

2. ఇక బైబుల్ లో వ్రాయబడిన ఏ లేఖనానికైన మరో సపోర్టింగ్ లేఖనం వుంటాది. అప్పుడే అది సరియైనది. పై లేఖనానికి మరో సపోర్టింగ్ లేఖనం యెహోషువా 5:13-15వరకు. ఇక్కడ యెహోషువా మరియు ఇజ్రాయెలీలు యోర్దాను దాటి యెరికోను స్వాధీనం చేసుకొందామని సిద్ధంగా వున్నారు. అప్పుడు యెహోవా సేనాధిపతి అనగా ఒక దేవదూత కనబడతాడు యెహోషువా గారికి. వెంటనే ఆయన అడుగుతారు దూతతో నీవు మా పక్ష్యమున వున్నవాడివా? మా విరోధుల పక్ష్యాన ఉన్నవాడివా? అంటే ఆ దేవదూత నేను మీ పక్ష్యాన రాలేదు మీ విరోదుల పక్ష్యాన రాలేదుగాని యెహోవా సేనాధిపతిగా వచ్చాను.దాని అర్ధం యుద్ధం చేసేది మీరు కాదు దేవుడే మీ పక్ష్యంగా యుద్ధం చేస్తారు. వెంటనే యెహోషువా గారు సాష్టాంగనమస్కారం చేస్తారు. అప్పుడు ఆ యెహోవా సేనాధిపతి ఏమన్నాడు? నీవు నిలచియున్న ఈ స్థలము పరిశుద్దమైనది కాబట్టి నీ పాదరక్షలు తీసివేయుమని చెప్పగా యెహోషువా ఆలాగు చేసెను.
మరి ఇది కూడా దేవమందిరం కాదు. అయినా సరే ఎక్కడైతే దేవుని దూతలు దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ దేవుని సన్నిధి వుంటుంది. అప్పుడది పరిశుద్ధ ప్రదేశంగా మారిపోతుంది. అప్పుడు మనం మన పాదరక్షలు తీసివేసి దేవుణ్ణి ఘనపర్చాలి అని దైవ గ్రంధం సెలవిస్తుంది.
మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుంటారో అక్కడ వారిమద్యన నేను ఉందునని యేసయ్య సెలవిచ్చారు మత్తయి 18:20లో. మరి ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కూడిన సభల్లో దేవుడు 100% ఉంటారు కదా! అలాంటప్పుడు పాదరక్షలు తీసివేయాలి కదా?మరి సభల్లో ఎందుకు తీసివేయడం లేదు?

తెల్లభోదకులు అనగా యూరోపియన్ దేశాలు, అమెరికా దేశాల్లో వున్నవారు ఎప్పుడూ తమ షూ వేసుకొని వుండాలి లేకపోతె చలికి రక్తం విరిగిపోయి ఫ్రాస్ట్ బైట్ అనే వ్యాధితో రక్తం పోయి చనిపోతారు. నేను కూడా చలి దేశాల్లో పని చేస్తున్నప్పుడు ఎన్ని వేడి కలిగించే దుస్తులు తొడుగులు వేసుకొన్నా ఒక అయిదు నిమిషాలు బయట పనిచేసి వస్తే చలికి వణికి పోయేవాడిని. అక్కడ ఇవన్నీ తప్పవు. మరి నీవు ఉండేది చలి దేశం కాదు కదా? ఒక్క హిమాలయాలు పరిసర ప్రాంతంలో తప్ప ఇంకా ఎక్కడా ఎప్పుడూ మంచు కురవదు. ఆలాంటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మన దేశంలో పాదరక్షలు ఎందుకు? తెల్ల భోదకులని నల్ల భోదకులు కూడా ఫాలో అవుతున్నారు. దేవుడు చెప్పినా సరే వీరు మానడం లేదు. మరి వీరికి వాక్యం తెలియదా అంటే చాలా బాగా తెలుసు. తెలిసే చేస్తున్నారు పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకొన్నట్లు. ఇది పక్కా వాక్య విరుద్ధం.

దయచేసి ప్రియ సహోదరి/సహోదరుడా! దేవుని సమాజంలో దేవుడు నిలచియున్నాడని గ్రహిచు(కీర్తన 82:1) కాబట్టి ఆయనకీ ఇవ్వాల్సిన గౌరవం ఆయనకివ్వు. మందిరంలో సభలలో నీ పాదరక్షలు తీసివేసేయ్. దేవుని దీవెనలు పొందుకో.
అట్టి కృప మనందరికీ కలుగును గాక ! దైవాశీస్స్సులు! ఆమెన్


Post a Comment

0 Comments